ప్రముఖులు

వెండి   తెరపై   నాగవంశం

కళా రంగంలో నాగవంశీయుల కీర్తి ప్రతిష్ట చాలా గొప్పదనే చెప్పాలి.  ఆనాటి నుండి నేటి వరకు  ఎందరో, మరెందరో  మంచి కళా కారులుగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తూనే ఉన్నారు.  అలనాటి సాలూరు  రాజేశ్వరరావు, కాళ్ళ అంజలీదేవి, కనకల మార్గాండ, కనకాల దేవదాసు ఆయన కుటుంబంలో అందరూ ఇలా పేరు పొందిన ప్రముఖులతో పాటు గయ్యల అత్తగా చిన్నచిన్న పాత్రలు వేస్తూ ప్రేక్షకులను దగ్గరైన సత్తి వంటి వారు చాలానే ఉన్నారు.  నాగవంశం బీజాలుగా  జన్మించిన వీరు పొట్టచేతి పట్టుకొని బ్రతుకు తెరుపు కోసం మద్రాసు సినీ ప్రపంచంలో అడుగుపెట్టి ఎవరికి వారు తమ తమ కళారంగంలో అనుభవం గడించి పేరు  సంపాధించినవారే.  సినీ సంగీత ప్రపవచంలో సాలూరు రాజేశ్వరరావు గారు ప్రతిభ అనేది జగమెరిగిన సత్యం.  సాలూరు మండలం శివరాంపురం పరిసిన ప్రాంతాలలో జన్మించిన ఈయన సంగీత శిఖఃరాలలో ఒక ధృవతారగా మిగిలారు.  ఈయన వారసులుగా  సాలూరు వాసుదేవరావు,  క . . . కొటిలు సంగీత దర్శకులుగా ఒక తరం యువతను  సంగీత ప్రియులను ప్రియరాగాలే లాంటి సుస్వరాలతో మయమరిపించారు. ఇక వారి వారసులుగా  ఉన్న వారు కధానాయకులు గాను నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.  ఇకఅంజలిదేవి ఈమె కోసం తెలియని వారు ఎవ్వరు ఉండరు.  ఈమె తూర్పు గోదావరి జిల్లాలో పుట్టి కళామతల్లి ముద్దుబిడ్డగా మారి, వెండి తెర  సీతమ్మగా మారి చాలా ఏళ్ళు పాటు ఎన్నో పాత్రలు పోషించి తెలుగు  ప్రజలనే కాదు తమిళ, కనడ ప్రజలు గుండెలలో కూడా చిరస్ధాయిగా నిలిచారు.  ఆమె  నాగవంశియురాలే అని చెప్పదానికి గర్వపడుతున్నాం.  సినీ ప్రపంచంలో మరో మహామనిషి కనకల మార్గాండ  గారు.  ఈయన కళారంగం కన్నా. . .

సినిమా టెక్నిక్ రంగంలో ఎడిటింగ్ చేస్తూ తనకంటూ ఒక  ప్రత్యక స్ధానం సంపాదించుకున్నారు  కనకల మార్గాండ గారు.  ఎలాంటి అధునాతన పరికరాలు లేని రోజుల్లో పిల్మ్  film  by  film గా  ముక్కలను, సన్నివేశాలను జతపరుస్తూ కనకల మార్గాండ గారు సినీజగత్తులో నాగావంశం కీర్తి ప్రతిష్టను ఎగురవేసారు.  ఇక ఆయన వారాసులుగా ఉన్న  మార్గాండ కనకల వెంకటేష్ గారు కూడా నాన్న గారి అడుగుజాడల్లో నడుస్తూ సినీ రంగంలో ఎడిటింగ్ అనే ఒక  విభాగం ఉంటుందని, దాని పనితనం ఎలా ఉంటుందోనని తెలిసేటట్టు చేసారు.  మార్గాండ కనకల వంకటేష్ గారు, ఎక్కువ కాలం  సురేష్ ప్రొడక్షన్ లో  పనిచేస్తున్న ప్రముఖ నిర్మాత స్వర్గీయ డి . రామానాయుడు  గారి మన్ననలను పొందారు.  కనకల ఇంటి పేరుతో నాగవంశం పుట్టిన ఈ కుటుంబం నాన్న గారి పేరును కూడా ఇంటిపేరు చేసుకొని ఒకవైపు నాన్నగారి పేరును మరోవైపు వంశప్రతిస్టని కలగలుపుతూ మార్గాండ  కె . వెంకటేష్ గా  అంటే మార్గాండ కనకల వంకతేష్ గా పేరును నిలుపుకున్నారు.  శ్రీకాకుళం జిల్లా కలివరం గ్రామం నుండి మొదలైన వీరి ప్రస్ధానం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, కొన్నాళ్ళు ఉండి చెన్నై బాట పట్టి సినీ ప్రపంచంలో తమకంటూ ఒక ముద్ర  వేసుకున్నారు.  సురేష్  ప్రొడక్షన్ లో చాలా వరకు సినిమాలు చేసారు.  మార్తాండ కనకల వెంకటేష్ గారు వీరు వారసులుగా ఉన్న వారు నటులు గాను, డైరెక్టర్ల గాను నిలదోక్కుతున్నారు.

ఇక నాగవంశంలో మరో కనకల కుటుంబం సినీ జగత్తుని ఉర్రుతలోగిస్తుంది. వారే కనకాల దేవదాసు కుటుంబం. వీరి కుటుంబం మొత్తం సినిమాలే…  సినిమాయే వారి జీవితం.  ఒక యాక్టింగ్ స్కూల్ నే నడుపుతూ చాలామందిని సిని రంగ ప్రవేశం చేసిన ఘనత కూడా వారిదే.. రాజీవ్ కనకాల సుమా ఇంకా చాలా మంది ఉన్నారు.. వీరే కాక, టీవీ సీరియల్స్ లోను, షార్ట్ ఫిల్మ్స్లో లోను ఇంకా చాలా రంగాల్లో నాగవంశియులుగా పరిచయం చేయడానికి గర్వపడుతున్నా౦.